వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
మూడు మండలాల నుంచి టీడీపీలోకి చేరికలు
వినుకొండ, మహానాడు : ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ మాత్రం ఆదమరిచినా రాష్ట్రం రౌడీల పాలవుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్న హింసే అందుకు సాక్ష్యమన్నారు. కొడుతున్నా, చంపుతున్నా, కాళ్లు, చేతులు విరగ్గొడుతున్నా పోలీసులు చోద్యం చూస్తుంటే ఇక ప్రజల ధన,మాన, ప్రాణాలకు భరోసానిచ్చేదెవరని ఆయన ప్రశ్నించారు. గురువారం వినుకొండ పట్టణం, బొల్లాపల్లి, నూజండ్ల మండలాల నుంచి అధికార వైకాపా వీడి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, విఠంరాజుపల్లి వద్ద జీవీ అతిథిగృహం వేదికగా పెద్దఎత్తున చేరికలు జరిగాయి.
బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండా నుంచి 10 కుటుంబాలు, వినుకొండ 2వ వార్డు సీతయ్య నగర్‌కు చెందిన 5 కుటుంబాలు, నూజండ్ల మండలం తిమ్మాపురం నుంచి 15 కుటుంబాలు, బొల్లాపల్లి మండలం కనుములచెరువు నుంచి 5 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారికి జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడారు. ప్రజలను పీడిరచుకు తిన్న మహామహా నియంతలే కూలి పోయారని ఈ జగన్‌రెడ్డి ఓ లెక్కా ప్రశ్నించారు. ఓటుహక్కుతో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడం ఒక్కటే ప్రజల ముందున్న మార్గమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్, తదితరులు పాల్గొన్నారు.