బూరగడ్డ వేదవ్యాస్
హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే శక్తివంతమైనదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.
టీటీడీ లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నిరసనగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు గురువారం నాడు పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు వేదవ్యాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయ మెట్లు శుభ్రం చేశారు.
పవన్ కళ్యాణ్ దీక్షకు ఆయన మద్దతు పలుకుతూ గత ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు. అపవిత్రమైన టిటిడి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని వ్యాస్ అన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా అపవిత్రం చేయలేరని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బూరగడ్డ కిషన్ తేజ జనసేన నియోజకవర్గం సమన్వయ కర్త పంచకర్ల సురేష్ కూటమి నాయకులు సుజ్ఞానం సతీష్ జల్లా బాలచంద్ర రావు బొడ్డు వీరలంకయ్య పుప్పాల నరసింహ పంచకర్ల శ్రీనివాస్ ఇల్లూరి నాగబాబు కూనపపరెడ్డి రంగయ్య నాయుడు జంపన కోటయ్య మణికంఠ ప్రభాస్ రాజు మరియు టీడీపీ&జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు