ఛలో మాచర్లకు అనుమతి లేదు: ఎస్పీ

నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ గురువారం తలపెట్టిన ఛలో మాచర్ల కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. జిల్లాలో కౌంటింగ్‌ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున టీడీపీ రాష్ట్ర నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ర్యాలీగా వెళ్లడం చేయకూడదని హెచ్చరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.