– మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి
మంగళగిరి: రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగట్లేదు. కక్ష పూరిత పరిపాలన సాగిస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి విమర్శించారు . చంద్రబాబు తన సీనియార్టీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ తోనే నడుపుతున్నారని.. నదిలో బోటు విషయం, తిరుమల వ్యవహారం అంతా డైవర్షనేనని విమర్శించారు .ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను వాగ్థానాలు నెరవేర్చకుండా కప్పిపుచ్చుకుంటూ, పాలన సాగిస్తున్నందుకు చంద్రబాబుకు శాల్యూట్ చేయాల్సిందేనన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దీక్ష లంటూ, సనాతన ధర్మం అంటూ మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు నియోజకవర్గ సమన్వయకర్తగా త్వరలోనే పార్టీ కమిటీలు ఎర్పరిచి పార్టీని బలోపేతం చేస్తామని వివరించారు.ఈ సమావేశంలో తాడేపల్లి పట్టణ వైయస్సార్ సిపి అధ్యక్షుడు బుర్రముక్కుల వేణుగోపాల రెడ్డి పాల్గొన్నారు