ఫర్నీచర్ మాత్రమే కాదు దోచుకున్న రూ.లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాలి

– అన్న క్యాంటీన్ల నిర్వహణకు సీఎంకు రూ.10 లక్షల విరాళం
– వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమంగా తనవద్ద పెట్టుకున్న ఫర్నీచర్‌తో పాటు దోచుకున్న రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కూడా తిరిగివ్వాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్న సంపదతో పాటు, గత ఐదేళ్లు దోచుకున్న లక్షల కోట్లు జగన్‌ వెనక్కి ఇవ్వాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి రాష్ట్రంలో అన్నక్యాంటీన్ల నిర్వహణకు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాధనంతో క్యాంప్ఆఫీస్‌గా నిర్మించుకుని, సకలహంగులు, ఫర్నీచర్ సమకూర్చుకు ని దాన్నే పార్టీ ఆఫీస్‌గా మార్చుకున్నా సామగ్రి వెనక్కి ఇవ్వకపోవడంపై కొన్నిరోజులుగా కొన సాగుతున్న వివాదంపై ఈ మేరకు స్పందించారు.

జగన్ ఇడుపులపాయ, యలహంక, లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్ లు అన్నీ ప్రజల నుంచి దోచుకున్న ధనంతో కట్టినవి కాదా? ప్రతి జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతా కాదా? అని నిలదీశారు. అన్నింటిలో దొంగగా అడ్డంగా దొరికింది చాలక ఇప్పుడు ఫర్నిచర్ దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎప్పు డో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పుడే పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు పరిమితమైనప్పుడు ఫర్నిచర్ ఎందుకు వెనక్కి పంపలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఫర్నిచర్ స్వాధీనం చేయమని పార్టీ నేతలు డిమాండ్ చేయలేదా అని నాటి పరిణామాలను మరోసారి గుర్తు చేశారు. అయినా నిస్సిగ్గుగా పార్టీ కార్యాలయంగా తాడేపల్లి కొంపను వాడుకుంటూ, ఇప్పుడు నంగనాచి లేఖలు రాయిస్తున్నారని జగన్‌ తీరుని దుయ్యబట్టారు ఎమ్మెల్యే జీవీ. చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడతాయని జగన్ గుర్తుపెట్టుకోవాలని, అతడు ఎన్ని లేఖలు రాసినా నూటికి నూరు శాతం ఫర్నిచర్ దొంగనే అంటారని స్పష్టం చేశారు.

అదీకాక ఫర్నిచర్ తీసుకెళ్లమని చెప్పటానికి లేళ్ల అప్పిరెడ్డి ఎవరని మరో సూటి ప్రశ్న సంధించారు. నాడు ఏ తప్పూ చేయని కోడెలపై ఫర్నిచర్ దొంగతనం నెపం మోపి ఆయన చావుకు కారణమయిన దుర్మార్గపు ముఠా మీరే కదా అని తూర్పారబట్టారు. దేశంలోనే అతి పెద్ద గజదొంగ ఎవరంటే ముందుగా వచ్చేది జగన్ పేరే అని, అంతలా లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న దొంగ ఇప్పుడు ఫర్నిచర్ మాత్రమే వెనక్కి ఇస్తానంటే ఒప్పుకునేది లేదని, మొత్తం కక్కిస్తామన్నారు.