Mahanaadu-Logo-PNG-Large

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

-దేశ రాజకీయాల్లోనే ఆయనొక సంచలనం
-ఆనాడే సంక్షేమ పథకాలను ప్రారంభించారు
-మహిళలకు ఆస్తిహక్కు, యూనివర్సిటీలు అన్న ఘనతే
-పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇచ్చారు
-బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారు
-జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుల నివాళి
-మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వేడుకలు

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్‌ 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగుకు వెలుగు తెచ్చింది ఎన్టీఆర్‌ అని కొని యాడారు. 1983లో తెలుగుదేశం ప్రభంజనంతో ఢల్లీికి వణకు పుట్టించి ఢల్లీిలో తెలుగు ఖ్యాతి చాటడన్నారు. ఆడవారికి ఆస్తిహక్కు, పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చింది ఎన్టీఆరేనని, ఆయన వేసిన తెలుగుదేశం అనే చెట్టు నేడు మహావృ క్షమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయనుందని.. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని నొక్కి వక్కాణించారు.

ఎన్టీఆర్‌ ఆశయాలకు పునరంకితం కావాలి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతికి ఎన్టీఆర్‌ మారుపేరు. సినీ రంగానికి ఆయనే రాజు, రారాజు. పౌరాణికం, సాంఘికం ఏదైనా ఆయన పాత్రలో ఒదిగిపోతారు. 60 ఏళ్ల వయసులో చైతన్యరథంపై 35 వేల కిలోమీటర్ల తిరిగిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మాండలిక వ్యవస్థ, పద్మావతి మహిళా యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, నిజాం సాగర్‌ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు ఎన్టీఆర్‌ చేశారు. నాడు ఎన్టీఆర్‌ ప్రారంభిం చిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి అమలవుతున్నారు. ఆ మహానుభావుడి ఆశయా లకు మనమందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌
మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 42 ఏళ్లు అయిం ది. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ నాడు ప్రారంభించిన పక్కాగృహాలు, పెన్షన్‌, జనతా వస్త్రాలు లాంటి ఎన్నో పథకాలు దేశం అనుకరించింది. కూటమి రాజకీయాలకు పునాది వేసి జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని నిలువరించిన మహానాయకుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించారు. రాబోయే రోజుల్లో లోకేష్‌ ముందుకు తీసుకువెళుతారు.

రాజకీయ సంస్కరణలకు పునాది
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ సంస్కరణలకు పునాది వేసిన నాయకుడు ఎన్టీఆర్‌. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ఆయనే సాటి. నందమూరి తారక రామారావు ఆశయా లకు అనుగుణంగా పనిచేస్తాను. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారా వు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలుగురైతు అధ్యక్షుడు శ్రీనివాస ండ్డి, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఆనందసూర్య, మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.