గుంటూరు: స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భం గా గుంటూరు పార్లమెంటరీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డాక్టర్ శ్రీ రత్న పాల్గొన్నా రు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి నాని(రవీంద్ర బాబు), ఆర్టీసీ మాజీ చైర్మన్ ఈడ్పుగంటి లోకేంద్రనాథ్, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, మానం పద్మశ్రీ, పార్టీ సీనియర్ నాయకులు సుకవాసి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
గుంటూరు టీడీపీ కార్యాలయంలో వేడుకలు
గుంటూరు టీడీపీ కార్యాలయంలో తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్, రావిపాటి సాయికృష్ణ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాళి
గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెరిగల మణికుమార్ పాల్గొని నివాళులర్పించారు.