దర్శిలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

-నివాళులర్పించిన గొట్టిపాటి లక్ష్మి
-కేక్‌ కట్‌ చేసి వృద్ధాశ్రమంలో అన్నదానం

దర్శి: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ముండ్లమూరు, దర్శి టీడీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేసి నివాళులర్పించారు. వృద్దా శ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొనే అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా భావిస్తున్నానన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు నినాదాలతో బడుగుల జీవితాల్లో మార్పుతెచ్చిన యుగపురుషుడి ఆశయసాధనకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి. పిచ్చయ్య, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టె వెంకటేశ్వర్లు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు.