మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను చార్లెట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ సానుభూతిపరు లు హాజరై నివాళులర్పించారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చార్లెట్ నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధించగలదని ఆకాంక్షించారు.