తిరుపతిలో అశ్లీల నృత్యాలు, ఏడుగురి అరెస్టు!

తిరుపతి, మహానాడు: తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను పూర్తిగా మంటగలుపుతున్నారు.