– చంద్రబాబును కలిసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : ఎసిఏ అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల చెక్ ను సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సందర్భంలో ఎంపి కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ప్రకటించారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబుకు కోటి రూపాయలు చెక్ ను అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎసిఏ ఉపాధ్యక్షుడు వెంకట ప్రశాంత్, కార్యదర్శి సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గౌరు విష్ణు తేజ్ పాల్గొన్నారు.