Mahanaadu-Logo-PNG-Large

వంద శాతం ప్రధాని రేసులో ఉంటా

మోదీ ఓ గోబెల్స్‌!
బీజేపీ దేవుని పేరుతో ఓట్లు దొబ్బి పోయే పార్టీ
ఢిల్లీ లిక్కర్‌ స్కాం మోదీ రాజకీయ సృష్టి
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, మహానాడు : అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటానని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శనివారం సాయంత్రం తెలంగాణా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయిస్తున్నవి పవర్‌ ఫ్లవర్స్‌. నరేంద్ర మోదీ తర్వాత నాయకత్వం పొద్దు తిరుగుడు పువ్వులా తయారైంది. పొద్దు ఎటు తిరిగితే పువ్వు అటు తిరిగినట్లు పవర్‌ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అంటే తెలంగాణా ఎమోషన్‌. ఆ బాండే జ్‌ కేసీఆర్‌కు ఉంటది. తుడిచేస్తాం అన్న వాళ్లు పిచ్చోళ్లు అని స్పందించారు.

మోదీ ఓ గోబెల్స్‌…దేవుని పేరుతో ఓట్లు దొబ్బిపోయే పార్టీ

మా పాలన విధ్వంసం అంటే వాళ్ల కంటే మూర్ఖులు లేరు. అవన్నీ కాగ్‌ నివేదికలు. ప్రభు త్వంలో ప్రతిరోజూ డబ్బులు జనరేట్‌ అవుతాయి. ప్రభుత్వం దగ్గర సూట్‌కేసులో డబ్బులు ఉండవు. ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అవుతుంది సంతోషం…ఇంకా జరగాలి. బీజేపీ దేవుని పేరుతో ఓట్లు దొబ్బిపోయే పార్టీ అని ఏ ప్రజలైతే అసమానతలకు గురవుతున్నారో వాళ్లకు న్యాయం జరగాల్సి ఉంది. రిజర్వేషన్లు తీసేస్తాం అంటే మా పార్టీకి వ్యతిరేకం. ముస్లింల పట్ల ద్వేషం పెట్టుకుని రిజర్వేషన్లు తీసేస్తామంటే కుదరదు. నా దొడ్లో అట్లే ఉంది. ఇవాళ సాయంత్రం తరవాత నీ దొడ్లో ఎట్లుంటదో చూస్కో. రేవంత్‌ బీజేపీలోకి వెళతాడు అంటున్నారు. నాతో చాలామంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అంటున్నారు చూడాలి..రేవంత్‌ మాట చలవ. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని వ్యాఖ్యానించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం ఏంటి?

జిల్లాల విషయంలో ప్రభుత్వం తీరు పనిలేదు అన్నట్లు ఉంది. పనిలేని మంగలి పిల్లి తల గొరిగిండు అన్నట్లు ఉంది. తెలంగాణా ప్రజల ప్రగతిని ఆశించి ఆ నిర్ణయం చేశాం. జిల్లాలు తీసేస్తే ప్రజలు యుద్ధం చేస్తాం అంటున్నారు. ముఖ్యమంత్రికి ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధం ఏంటి? మాకు నివేదికలు ఇస్తారు అంతే. వాళ్లు అవి ఎలా నివేదికలు ఇస్తారో సీఎంకు అవసరం లేదు. గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వాలు ఉండవు. రోజూ సీఎంకు మార్నింగ్‌ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌ ఉంటుంది. అది పోలీసుల ఇంటర్నల్‌ మ్యాటర్‌. అనుమతి లేకుండా చేయరు. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం జరుగుతుంది. డేటాను డిస్ట్రాయ్‌ చేసే అధికారం కూడా చట్టం ప్రకారం వాళ్లకు ఉంటుంది. ప్యారగాన్‌ చెప్పులు వేసుకు న్నది, కబ్జాలు చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.

చేతగాని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావ్‌…

చేతగాని ముఖ్యమంత్రి ఉంటే పెట్టుబడులు తరలివెళతాయి. గుజరాత్‌కు పరిశ్రమలు తరలిస్తుంటే నువ్వేం చేస్తున్నావ్‌ మరి రేవంత్‌ అంటూ ప్రశ్నించారు. మోదీని తట్టుకుని మేం ఫేస్‌బుక్‌ లాంటి అనేక బహుళజాతి కంపెనీలను హైదరాబాదుకు తెచ్చాం. రైతుబంధు సృష్టికర్తను నేనే. తెలంగాణా వ్యవసాయ రంగానికి జవసత్వాలు తేవాలని మేం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నాం. 18.36 శాతం రైతాం గం జీఎస్‌డీపీ కాంట్రిబ్యూషన్‌ ఉందని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. మోదీ రాజకీయ సృష్టి

నేను, అరవింద్‌ కేజ్రీవాల్‌ మోదీ కంట్లో నలుసులా ఉన్నాం. అందుకే ఏజెంట్లను పంపారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన బీఎల్‌ సంతోష్‌ తప్పించుకున్నాడు. నన్ను, కేజ్రీవాల్‌ను రాజకీయంగా ఒత్తిడి చేయడానికే బీజేపీ ఈ స్కాంకు తెరలేపింది. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ. ఓటు బీఆర్‌ఎస్‌కు వేస్తే భవిష్యత్తులో హక్కులు కాపాడుకోవచ్చు. ప్రజలకు బీఆర్‌ఎస్సే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.