నాసిక్: మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉద్ధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్ళొద్దని స్థానిక అధికారులు హెచ్చరించారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో రాంకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.