పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ రాజన్న
కేఎస్ రాజన్న.. తన సేవా కార్యక్రమాలకు గానూ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దివ్యాంగుడైన ఆయన మోకాళ్లపై నడిచి వచ్చి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్దకు వెళ్లి నమస్కరించారు. కర్ణాటకకు చెందిన రాజన్న 11 నెలల వయసులో పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయారు. మనోధైర్యం కోల్పోకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.