– బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ , మహానాడు: గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల ప్రచారం చూసి చచ్చిపోయేవాడు. గత ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తూ గోరంత రుణమాఫీ చేసి కొండంత చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రుణ మాఫీకి ఎలాంటి నిబంధనలు గత మా ప్రభుత్వం పెట్టలేదు. 2014 లో 16 వేల కోట్లు మేము ఖర్చు పెడితే ఇవ్వాళ 6 వేల కోట్లు ఖర్చు కావటం ఏంటి. ఆంక్షలతో రైతుల సంఖ్యను తగ్గించటం వల్లే ఆరు వేల కోట్లు అయింది. రుణ మాఫీతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం ఉంది…రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఆరు వేల కోట్లతో రుణ మాఫీ అంటూ రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మేము చెప్పిన లెక్కలు తప్పయితే అసెంబ్లీలో చర్చించటానికి మేము రెడీ. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మేల్యేలు రాజీనామాలకు ఎప్పుడూ భయపడలేదు. ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారు. రేవంత్ రెడ్డి కొండంగల్ ఓడితే రాజీనామా చేస్తా అన్నారు….చేశారా అని ప్రశ్నించారు.