పల్నాడు పోలీసు ఎన్నికల పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌

పల్నాడు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పల్నాడు జిల్లాకు ఎన్నికల పోలీసు పరిశీలకులుగా డీఐజీ అజిత్‌సింగ్‌ను నియమించారు. ఈ సందర్భంగా పలనాడు జిల్లాకు వచ్చిన అజిత్‌ సింగ్‌కు పోలీసు యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. ఈ మేరకు నరసరావుపేట లోని మునిసిపల్‌ గెస్ట్‌ హౌస్‌లో పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి అనుసరించి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కలిసి చర్చించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.