Mahanaadu-Logo-PNG-Large

ఖబడ్దార్ రోజా…! నీది నోరా.. తాటిమట్టా?

• వరదలు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేయడం కాదు
• కారు కూతలు కూస్తే సహించేది లేదు.. నీ దందాలు అన్నీ బయటకు వస్తున్నాయి
• నీ దోపిడీకి ప్రజల ప్రాణాలే పోయాయి
• దోచుకుని, చెన్నైలో కులుకుతూ.. సిగ్గులేకుండా మాట్లాడుతావా?
• వరద బాధితులకు ఒక్క బిస్కేట్ ప్యాకేట్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తావా?
• పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలే తరిమి తరిమి కొడతారు
– మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

మంగళగిరి, మహానాడు: కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని దిక్కుమాలిన రాచపీనుగుల పార్టీ వైసీపీ అని.. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బురద రాజకీయాలు చేస్తున్నారని. ఇదే వైసీపీ సంస్కృతి అని, జగన్ మోహన్ రెడ్డి తీరని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆమె మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. విజయవాడ ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా ఏదోకటి మాట్లాడి జగన్ లండన్ ఫైట్ల్ ఎక్కేయాలని చూడటం ప్రజలు గమనిస్తున్నారు. జగన్ కలుపు మొక్కల్లో ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గులేకుండా చెన్నైలో కూర్చుకుని మాట్లాడుతున్నారు.

చంద్రబాబు లోకేష్ ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. నగరిని వదిలి యూరప్, చెన్నైలలో ఎంజాయ్ చేస్తూ… అసలు కళ్లుండి మాట్లాడుతుందో, మతిపోయి మాట్లాడుతుందో అర్థం కావడంలేదు. కంటిమీద కునుకులేకుండా అహర్నిశలు కష్టపడుతూ.. ప్రజలకు ఆహరం అందించడంతో పాటు అందరికీ భరోసా ఇస్తూ.. చిన్నపిల్లలు, గర్భిణులు, పెద్దలను కాపాడుతూ.. పునరావాస కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ… నిరంతరం నారా లోకేశ్, చంద్రబాబులు కష్టపడుతుంటే.. నీ కళ్లకు కనిపించడం లేదా రోజా.. సిగ్గులేకుండా శవరాజకీయాలు చేస్తారా? వరదల్లో మునిగిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టినా బుద్ది రాలేదా?

ఏపీఐఐసీ చైర్మన్ గా ఉంటూ.. కృష్ణపట్నం భూముల్లో రెండువేలకు పైగా లావాదేవీలు జరిగితే నువ్వు ఎంత వాటా తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు. ఏపీ టూరిజం మినిస్టర్ గా నువ్వు ఎన్ని దందాలు చేశావో ప్రజలందరికీ తెలుసు. సీఎంవోలో ఒక ప్రముఖ అధికారి మేనళ్ళుడిని అక్కున చేర్చుకుని అర్హత లేకపోయిన అర్టీసీలో పనిచేసే వ్యక్తిని రాయలసీమ డివిజనల్ మేనేజర్ గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశావో అందరికీ తెలుసు.

జగన్ మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో.. ఆ కబ్జా చేసిన వ్యక్తి మీ రెడ్డి పేరుకూడా మాకు తెలుసు.. అతను మీకోసం గెస్ట్ హౌస్ లు కడుతున్న విషయం కూడా మాకు తెలుసు.. మీరా మళ్ళీ నారా లోకేష్ గురించి మాట్లాడేది? మంగళగిరి నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి ఇంటిపక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాల భూమి దోచుకున్నావో అందరికీ తెలుసు. నగరిలో కూడా ఆ రెడ్డి మీకు బినామీగా ఉంటూ మీ కోట్ల ఆస్తులను భూజాల మీద మోస్తున్నారని తెలుసు. ఏపీఐఐసీ చైర్మన్ గా ఉండగా కోట్ల రూపాయాల ఫర్నీచర్ ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటు లైన్ కాంట్రాక్టులు ఇచ్చి దండుకున్నది అందరికీ తెలుసు.. నీ అన్నదమ్ములను పక్కన పెట్టుకుని నగరి నియోజకవర్గ ప్రజలను ఎంత నాశనం చేశావో అక్కడి ప్రజలను అడిగితే చెబుతారు.. ఆడుదాం ఆంధ్రా పేరుతో వంద కోట్ల దోపిడీ అందరికీ తెలుసు. అన్ని బయటకు వస్తాయి. ఖబడ్దార్ రోజా.. నోరు జాగ్రత్త!

ఏ కాంట్రాక్టరైనా సరే మీకు కప్పం కట్టాల్సిందే…. ఆ కప్పం కట్టలేక ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మీకు లంచాలు కట్టలేక గుండెపోటులతో మృతి చెందిన లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. వడమాల పేట అంజేరమ్మ కనుమ దగ్గర పేద ప్రజలకు సంబంధించిన డీకేటీ భూములు ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ తెలుసు. అనధికారికంగా టోల్ గేట్లు నడిపి నగరి నియోజకవర్గ ప్రజల నడ్డి విరిచేసిన హీన చరిత్ర నీది.. అంతేకాకుండా ఒక మహిళను మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పి డబ్బులు దండుకుని ఆమెను మానసికంగా హింసించిన నువ్వు నేడు నారా లోకేష్ గురించి మాట్లాడుతావా…. సిగ్గులేకుండా?

3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. అక్రమంగా తండ్రిని జైల్లో పెట్టినా సహించి ఒంటి చేత్తో పార్టీని నడుపుతూ.. పార్టీ గెలుపునకు 95% కృషి చేసిన నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే అది నోరా తాటిమట్టా అనేది నువ్వే తెలుసుకోవాలి. సాటి నటి జత్వానీపై పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టినా.. ఒక్క మాట మాట్లాడని నువ్వు సిగ్గులేకుండా నారా లోకేష్, నారా చంద్రబాబులపై మాట్లాడుతావా? వరదలు వస్తే గొడుగులు పట్టుకుని రీల్స్ చేయడం కాదు.. ఎలా పనిచేయాలో…. ఏ రకంగా ప్రజలకు భరోసా ఇవ్వాలో…. వారి ప్రాణాలను ఏరకంగా నిలపాలో…. చేసి చూపించిన వ్యక్తి మా నాయకులు నారా చంద్రబాబు, నారా లోకేష్ లు. మంత్రులు అందరూ నేడు ఫీల్డ్ లో నిలబడ్డారు. నేను ఆరోగ్య కారణాలతో వెళ్ళలేక పోయాను.. కనీసం ఎందుకు మాట్లాడుతున్నామనే బుద్ధి కూడా మీకు లేదు. బుడమేరుకు గండ్లు పడటానికి కారణం మీరే. ఇసుక, మద్యం, సెంటు పట్టా, పేదల ఇళ్లు, ప్రతిదానిలో దండుకున్నారు. ముందు లండన్ లో మీ నాయకుడు ఆస్తుల సంగతి ఏంటో బయట పెట్టాలి.. పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలే తరిమి తరిమికొడతారు. బొత్సను ఏ రకంగా తరిమి కొట్టారో చూశారుగా? వైసీపీ నేతలు వరద బాధితులకు ఒక్క బిస్కేట్ ప్యాకేట్ ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గులేకుండా మాట్లడుతున్నారు.