గుంటూరులో స్థానికులనే గెలిపించుకుందాం
బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్
అమరావతి, మహానాడు : జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధం ద్వారా అంతమొందించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా గల్లా మాధవిలను, గుంటూరు పార్లమెంటు పరిధిలోని శాసనసభ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. గుంటూరు నగరంలో ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థులు స్థానికులని, వైసీపీ అభ్యర్థి విడుదల రజిని స్థానికేతరురాలు అని తెలిపారు. ఓటింగ్ రోజు న ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.