పట్టభద్రుల ఎమ్మెల్సీ మళ్లీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సమక్షంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ వెరిఫికేషన్, క్లస్టర్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే క్లస్టర్ యూనిట్, బూతు ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. క్లస్టర్,బూత్,యూనిట్ ఇన్చార్జిలు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలని సూచించారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ మళ్ళీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్లు పాల్గొన్నారు.