Mahanaadu-Logo-PNG-Large

వేధించిన ఎస్పీ జాషువా గెస్ట్‌హౌస్‌కు పట్టాభిరామ్‌

సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అదృశ్యం
పుష్పగుచ్చం, శాలువా ఉంచి వీడియో సందేశం

విజయవాడ: గత ఏడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీసుస్టేషన ్‌లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ను బుధవారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ, తెలుగుయువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, సీనియర్‌ బీసీ నాయకులు కాపు మల్లిఖార్జున యాదవ్‌, తెలుగుయువత నాయకుడు బుడిపిటి సురేష్‌ ఉన్నారు. జాషువా సేవలకు మెచ్చి పుంగనూరు పుడిరగ్‌ చిత్తూరు జిల్లా పోస్టింగ్‌ వేయించుకోగా ఆ కుట్రలు తెలిసి ఎలక్షన్‌ కమిషన్‌ విధుల నుంచి తప్పించింది. ప్రస్తుతం విజయవాడ సమీపంలోని తన ఏడున్నర ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన అతిథిగృహంలో జాషువా ఉన్నారని తెలుసుకు ని పుషగుచ్చం, శాలువాతో సత్కారం చేయాలని వెళ్లారు. అయితే ఫలితాలు వెల్లడి తర్వాత ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అదృశ్యమయ్యారని తెలిసింది.  దాంతో అతిథిగృహంలోనే ఒక కుర్చీలో పుష్పగుచ్చం, శాలువా ఉంచి వీడియో ద్వారా తన సందేశాన్ని ఆయన సెల్‌ఫోన్‌కు పంపించారు.