Mahanaadu-Logo-PNG-Large

నా అల్లుడి వెనుక పవన్‌కళ్యాణ్‌, బాబు

`ఓటమి భయంతో దుష్ప్రచారం చేయిస్తే భయపడతానా
`నా కుమార్తె పిల్లలతో నా సంరక్షణలో ఉంది
`ఎన్నికల వేళ నీచ రాజకీయాలు మానుకోండి
`రాజకీయ లబ్ధి కోసమే కుటుంబ విషయాల్లో జోక్యం
`సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో తన అల్లుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానల్స్‌ సోషల్‌ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్‌ నా మీద చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రచారం కూడా చేశాయి. కొన్ని చానల్స్‌ ఫోన్‌ చేసి వివరణ అడిగాయి. ఇది నా కుటుంబ విషయమని చెప్పాను. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పొన్నూరు వచ్చి మా అల్లుడు విషయాన్ని కామెంట్‌ చేశాడు. ఆ మీటింగ్‌లో జనం కూడా పెద్దగా లేరు. ఆయన మాట్లాడిన తర్వాత అందరి కీ చెప్పాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా రెండో కుమార్తెకు ఇద్దరు పిల్ల లు. ఒక బాబు, పాప. కుటుంబంలో వివాదం రావటం వల్ల నా కూతురు, పిల్లలు నా సంరక్షణలో ఉన్నారు. నా రెండో అల్లుడు ఎటువంటి సాయం చేయకుండా వదిలేశాడు. కూకట్‌పల్లి కోర్టులో డైవర్స్‌ కోసం అప్లై చేసుకున్నాడు. ఇది పూర్తిగా నా కుటుంబ విషయం. ఎన్నికలు ఉన్న సందర్భంలో నేను దుర్మార్గుడిని, దుష్టు డినని నా అల్లుడు చెబుతున్నాడు. పవన్‌కళ్యాణ్‌ను కలుస్తాను చంద్రబాబును కలుస్తానని బెదిరించాడు. కుమార్తె, పిల్లల భవిష్యత్తు తేలాలి కదా అందుకే చెప్పదలచుకోలేదు.

నా కూతురు తన కాళ్ల మీద తను నిలబడాలన్న ఉద్దేశంతో చదివించాను. ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. నా కూతురుని, పిల్లలను వదిలేసిన దుర్మార్గుడు నా అల్లుడు మాటల వెనక పవన్‌కళ్యాణ్‌ ఉన్నాడు..చంద్రబాబు సపోర్ట్‌ చేస్తున్నాడు…ఇది దుర్మా ర్గం కాదా అని ప్రశ్నించారు. ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గమన్నా రు. సత్తెనపల్లిలో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత ఇటువంటి చవక బారు ఎత్తుగడలు వారిద్దరూ కలిసిక ట్టుగా ఆడుతున్న నాటకం. నా అల్లుడు వీడియో చేసి టీవీ 5, ఏబీఎన్‌ లైవ్‌ ఇస్తాడు. పవన్‌కళ్యాణ్‌ పొన్నూరు లో మాట్లాడుతాడు. దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. నేను మాట్లాడితే అందరి కుటుంబాల్లో వివాదా లు ఉన్నాయి. నా అల్లుడితో పోస్ట్‌ చేయించి జై కన్నా అని పోస్టు చేస్తారా. చీప్‌ రాజకీయాలకు భయపడను. ఎక్కడా తగ్గేదిలేదని స్పష్టం చేశారు. కోడెల కుటుంబ వివాదంలో నేను ఎంటర్‌ అవ్వలేదు. నీచ రాజకీయాలు లతో దృష్టిమార్చాలని అనుకుంటున్నారు. పవన్‌, బాబుకు చెబుతున్నా… నీచమైన రాజకీయాలు చేయవద్దు. ఎన్నికల కీలకమైన సమయంలో పవన్‌, బాబు నా అల్లుడిలో పరకాయ ప్రవేశం చేస్తున్నారని మండిపడ్డారు.