Mahanaadu-Logo-PNG-Large

పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దుండగుల దాడి

రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడి

జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్పేట్లోని ఆయన ఇంటిపై రాడ్లు, రాళ్లు, కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబసభ్యులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.