Mahanaadu-Logo-PNG-Large

కేంద్రమంత్రులను కలిసిన పెమ్మసాని

-కమ్యూనికేషన్‌, గ్రామీణాభివృద్ధి మంత్రులతో భేటీ
-నేడు సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరించనున్నట్లు వెల్లడి

ఢిల్లీ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియాను ఢిల్లీలో పెమ్మసాని మంగళవారం విడివిడిగా కలిశారు. తమను కలిసేందుకు వచ్చిన పెమ్మసానిని ఇద్దరు కేంద్ర మంత్రులు ఆత్మీయంగా ఆహ్వానించారు. వారికి పుష్పగుచ్చం ఇచ్చిన అనంతరం పెమ్మసాని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరిని కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సమస్యలపై త్వరలోనే పూర్తి వివరాలు అందజేస్తానని, అలాగే గ్రామీణాభివృద్ధితో పాటు కమ్యూనికేషన్స్‌, గుంటూరు పార్లమెంట్‌ పురోగతి దిశగా పనిచేస్తానని తెలిపారు. పెమ్మసానితో పాటు ఆయన సతీమణి పెమ్మసాని శ్రీరత్న కూడా ఉన్నారు.