Mahanaadu-Logo-PNG-Large

అయ్యో… కలం కూలీలూ…

(బహదూర్)

విధి నిర్వహణలో విలేఖరుల శ్రమ ఏంటో ఈ ఘటన నిరూపిస్తుంది. ఆకలి తెలీదు.. దప్పిక ఉండదు. ఇంటి దగ్గరు భార్య పిల్లలు తిన్నారో? లేదో గుర్తుకు రాదు. ఒకటే ధ్యాస. ప్రజల కష్టాలు గుర్తించాలి. మంత్రుల ఊరట ఏంటో తెలుసుకోవాలి.

ఇదే లక్ష్యంతో గోదారి నది ఉగ్ర రూపంలో ఉరకలేస్తుంటే.. ముంపు ప్రాంతాల్లో జనం ప్రాణాలు ఉగ్గబట్టి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. పరామర్శలకు బయలుదేరిన మంత్రుల కార్యక్రమ కవరేజీకి వెళ్లిన 30 మంది ఏలూరు జిల్లా జర్నలిస్టుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట డీపీఆర్ఓ ఏర్పాటు చేసిన ఆర్టీసీ లగ్జరీ బస్సు రివర్స్ చేస్తుండగా గోతిలో ఇరుక్కుంది.

అటు వైపు వర్షం, ఇటు వైపు నిండు గోదావరి, వరద పెరిగితే ఏమీ జరుగుతుందోనని అర్థం కాని స్థితి. మార్గమధ్యలో చిక్కుకున్న జర్నలిస్టులకు ఎన్డీఆర్ ఎఫ్ దళమే దిక్కు. మధ్యలో … ఫోటోలు పెట్టండి. వార్త ఇవ్వండి అని నెట్ వర్క్ ఇన్ చార్జీల హుకుం. జీతాలు సకాలంలో ఇస్తారా? ఆ ఒక్కటీ అడక్కూడదు. యాడ్ లు తేవాలి. క్యాష్ అండ్ క్యారీ అయితే కంపెనీకి మరీ మంచిది. ఇదీ మన జర్నలిస్టుల బతుకు.