కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌

ఉయ్యూరు, మహానాడు : కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి బోడె ప్రసాద్‌ను గెలిపించాలని సోమవారం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. బాలశౌరి, బోడె ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు. జగన్‌ నిరంకుశ పాలనకు విసిగిపో యిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపుదామా అని ఎదురు చూస్తున్నారన్నారు.

ఈరోజు ఉయ్యూరులో ఇంత పెద్దఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి కూటమికి మద్దతు తెలుపుతున్నారంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతుందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఆపడం ఎవరివల్లా కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.