-జగన్ పాలనతో జనం విసిగిపోయారు
– 38వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ
రాజమహేంద్రవరం : ఐదేళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు.
స్థానిక 38వ డివిజన్లో బీసీ సెల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తదితరులతో కలిసి డివిజన్లోని ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలుపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ మాట్లాడుతూ ఐదేళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించిన జగన్రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.