-గుంటూరు నూతన ఎస్పీ సతీష్ కుమార్
గుంటూరు, మహానాడు: శాంతిభద్రతల పరిరక్షణలో ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ అన్నారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలోని వీరభధ్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు.