వైసీపీ మేనిఫెస్టో… చిత్తు కాగితం
కూటమితోనే అభివృద్ధి
పశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి
అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నాళం ఠాకూర్ తో కలిసి పున్నమిఘాట్ , విద్యాధరపురం, కుమ్మరిపాలెం, కొట్టేటి కోటయ్య వీధి, నాలుగు స్తంభాల సెంటర్ తదితర ప్రాంతాల్లో సుజనా పర్యటించారు. సుజనాకు స్థానికులు తమ సమస్యలను చెప్పుకున్నారు.
ఎన్నికల్లో వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సుజనా పిలుపునిచ్చారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి విజయవాడ పశ్చిమ నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అని సుజనా అభివర్ణించారు.
యువతకు ఉద్యోగాలు లేవు పట్టుమని పది పరిశ్రమలు రాలేదు కల్తీ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని హజ్ హౌస్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధికి సహకరిస్తామని వివరించారు ఎన్డీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ-టీడీపీ- జనసేన కూటమిగా ఏర్పడ్డాయని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎం ఎస్ బేగ్ , టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, కరిముల్లా, టీడీపీ డివిజన్ మాజీ అధ్యక్షులు సురభి బాలు సుజనాకు మద్దతుగా నిలిచారు.