-ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో… ఈ లోకేష్ తగ్గేదే లేదు
-కూటమి విజయదుందుభి వార్తలతోనే అరాచక శక్తులు పరార్
-చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద
-పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జిల్లాలకు న్యాయం చేస్తాం
-ఏలూరు యువగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
ఏలూరు: మన ఇంట్లో దొంగలు పడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమికొడతాం. రాష్ట్రంలో ముఖ్యమం త్రిగా 420 ఉన్నారు, ఆయన ఆస్తులకన్నా కేసులు లిస్టు పెద్దది, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమితరిమి కొట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపం వద్ద జరిగిన యువగళం సభలో యువనేత లోకేష్ యువతనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జర్నలిస్టు గోపి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భం గా లోకేష్ మాట్లాడుతూ… నెలరోజుల్లో రాష్ట్రం నుంచి శనిపోతోంది, ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఇప్పుడు ఏ నోట విన్నా జరుగు జరుగు జగన్..ఖాళీ చేయి కుర్చీ అనే నినాదమే వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయ దుందుభి మోగిస్తోందన్న వార్తలతోనే రౌడీలు, గూండాలు, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు రాష్ట్రం వదిలి పారిపోతారు. అయితే ఎక్కడికి వెళ్లినా వారిని వదిలిపెట్టను. భూమండలంలో ఎక్కుడున్నా పట్టుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడినందుకు నాపై తాజాగా సీఐడీ కేసుపెట్టారు, మై డియర్ జగన్ ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఈ ప్రభు త్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నాపై 24వ కేసు పెట్టారు. 2014కి ముందు ఏనాడు నాపై కేసులేదు. ఏనాడూ తప్పు చేయలేదు. నిప్పులాగా బతికాను. జగన్‌లా పరదాలు కట్టుకుని తిరగలేదు. చెట్లు నరకలేదు.. దమ్ముధైర్యంతో ఉన్నాం. తప్పుచేయలేదు కనుకే ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చాం. బాంబులకే భయపడని కుటుంబం మాది..నీ చిల్లర కేసులకు భయపడతారా? చంద్రబాబును అక్రమంగా తప్పుడు కేసుల్లో ఇరికించి 53 రోజులు జైలులో పెట్టారు. అదే సింహం జగన్‌ను ఇప్పుడు వేటాడుతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారి కోసమే ఎర్రబుక్ పెట్టా. ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చట్టాన్ని అతిక్రమించి ప్రజలను వేధించిన వారి పేర్లు ఎర్రబుక్‌లో రాశా. అటువంటి వారిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
అది ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే
జగన్ ప్రభుత్వం తాజాగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముమ్మాటికీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టే. వైసీపీ నాయకులు భూములు కొట్టేసేందుకే ఈ నల్లచట్టం. రూపాయి రూపాయి కూడబెట్టి తాత,తండ్రులు వారసుల కు భూమిలిస్తే జగన్ ఫొటోలు వేసుకోవడమేమిటి? సర్వే రాళ్లపై కూడా ఫొటోలే. ఈ యాక్ట్ ప్రకారం ఒరిజినల్స్ తమ వద్ద ఉంచుకుని ప్రజలకు జెరాక్స్ ఇస్తారట. భూమి ఎవరిదో అధికారులే నిర్ణయిస్తారట. భూకబ్జాలతో గత ఐదేళ్లుగా జనాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశాం. అటువంటి వాటిని చట్టబద్ధం చేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్‌కు ఇంకొక అవకాశం ఇస్తే మీ బిడ్డను అని భూమి లాక్కుంటాడు. మీ భూమి నాది అంటాడు. చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనేనే ఉంటుంది. మళ్లీ పాత చట్టం తెస్తాం.. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉండదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా జగన్ ఘోరంగా ఫెయిల్
జగన్ స్కూలులోనే ఫెయిల్, కాలేజీలో ఫెయిల్, ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్. అడుగడుగునా ప్రజల ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. బడుగు, బలహీనవర్గాలపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. జగన్ సర్కారు నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడానికి గంజాయి ప్రధా న కారణం. గంజాయి మాఫియాలతో పచ్చని కుటుంబాలు నాశనమవుతున్నాయి. దిశ చట్టం లేకుండా పోలీసుస్టేషన్లు పెట్టారు. లేని చట్టం కారణంగా మహిళలను వేధించే సైకోలకు వెంటనే బెయిల్ వస్తోంది. రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు బహిరంగంగా తిరుగుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వందరోజుల్లో గంజాయికి ఫుల్‌స్టాప్ పెడతాం. స్మగ్లర్లను వెంటాడతాం. వందరోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం.
ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రానికి తీరని నష్టం
గత ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరుతో ఎంత నష్టపోయాం, రాజధాని లేదు, పోలవరం నాశనమైంది. పెట్టుబడులు, ఉద్యోగాలు పోయాయి. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. గతంలో 10 ఓట్ల తేడాతో రాష్ట్రంలో ఓ ఎంపి అభ్యర్థి ఓడారు. మంగళగిరిలో 2014లో 12 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఓడారు. యువత ఎక్కడ ఉన్నా ఎన్నికల సమయానికి వచ్చి ఓటు వినియోగించుకోండి. గత ఐదేళ్లుగా రాష్ట్ర యువత చాలా నష్టపోయారు. రాష్ట్రానికి అత్యధిక పన్నులు కట్టే అమర్ రాజా విస్తరణ యూనిట్ వైసీపీ వేధింపులతో తెలంగాణాకు వెళ్లిపోయింది. పొల్యూషన్, లేబర్ శాఖలతో వారిని వేధించారు. పెట్టుబడిదారులకు భరోసా కలగాలంటే కూటమి అభ్యర్థులు 160 స్థానాలు గెలవాలి. జీవితంలో జగన్ సీఎం కాడని భరోసా వస్తేనే పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు సీఎం అయిన వందరోజుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు వరదలా వస్తాయి. అధికారంలోకి వచ్చాక గోదావరి జిల్లాల్లో పెండిరగ్‌లో ఉన్న పోలవరం, చింతలపూడి లిఫ్ట్ వంటి సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం. గత ప్రభుత్వం 72 శాతం పూర్తిచేసిన పోలవరం ప్రాజెక్టుకు జగన్ రివర్స్ టెండరింగ్ బ్రేక్ వేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగిగి ప్రారంభిస్తాం. జగన్ బటన్ నొక్కుతున్నాడు. కానీ ఆ బటన్‌కు కరెంటు లేదు..డబ్బులు పడటం లేదు. కాలేజీ వాళ్లు హాల్ టిక్కెట్లు, మార్కులు లిస్టులు ఇవ్వాలంటే డబ్బు కట్టాలని అంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా పాత స్కూలు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం అమలుచేస్తాం. కళాశాలల్లో ఆగిపో యిన మార్కుల లిస్టులను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి విద్యార్థులకు అప్పగిస్తాం.
సింగిల్ సింహం మట్టికరవడం ఖాయం
ముఖ్యమంత్రి జగన్ సింహం సింగిల్ అంటున్నాడు. సింహం ఎక్కడైనా పరదాలు కట్టుకుని వస్తుందా, వేటా డేందుకు రెండు సింహాలు వచ్చాయి, ఒకటి చంద్రబాబు, రెండు పవనన్న. జగన్ నీ టైమ్ అయిపోయింది. మే 13న రెండు సింహాల మధ్య నువ్వు మట్టి కరవడం ఖాయం. జగన్ నేను అనాధను అంటున్నాడు. తండ్రిని చంపి జడ్జి ముందు నేను అనాధను..కాపాడమని అడిగినట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంది. ఎన్నికలప్పుడు జగన్ రెండు డ్రామాలు రక్తికట్టిస్తారు. మొదటిది శవరాజకీయాలు, రెండోది సానుభూతి. 2014లో తండ్రి శవాన్ని వాడారు. 2019లో బాబాయి శవాన్ని వాడారు. ఇటీవల పెన్షన్లు ఇవ్వకుండా 32 మంది వృద్ధులు చంపి ఆ శవాలతో రాజకీయం చేయాలని చూశారు. ఇటీవల జగన్‌పై స్పెషల్ గులకరాయి పడిరది. ఆ రాయి సీఎంకు తగిలి, తర్వాత వెల్లంపల్లి రెండుకళ్లకు తగిలిందట. గులకరాయి కూడా కోడికత్తిలాంటిదే. సీఎం బస్సుయాత్ర చేసేటప్పుడు తొలిరోజు చిన్నగా ఉన్న బ్యాండేజి శ్రీకాకుళం వెళ్లాక పెద్దదైంది. కనీసం అక్కడ మరక కూడా లేదు. జగన్ సినిమాల్లోకి వెళ్లి ఉంటే బ్రహ్మానందంకు పోటీపడేవారు. గతంలో కోడికత్తి తర్వాత బాబాయ్ శవం లేచింది. ఇప్ప్డుడు ఎవరి శవం లేస్తుందోనన్నదే నా భయం.
వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పిస్తాం
గత టీడీపీ హయాంలో రెండు డీఎస్సీలు ఏర్పాటుచేశాం, 32 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 2.2 లక్షల మంది శిక్షణ ఇవ్వగా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గతంలో పశ్చిమగోదావరిని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేశాం. గతంలో ఆక్వారంగాన్ని ప్రోత్సహించాం.. విద్యుత్ సబ్సిడీ ఇచ్చాం. పట్టిసీమ పూర్తిచేశాం. చింతలపూడి ప్రాజెక్టు 80 శాతం పూర్తిచేశాం. డిఫెన్స్‌కు భూములు, ఫార్మాకు భూములు కేటాయించాం. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల అవన్నీ తెలంగాణాకు వెళ్లాయి. 2019లో ఒక్క అవకాశం మాయలో మోసపోయాం, వైసీపీ అధికారంలోకి మొదటి సంవత్సరం లోనే 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానన్నారు, జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారు, ప్రతిఏటా కానిస్టేబుల్ పోస్టులు అన్నారు..ఒక్కటీ ిలేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. 25కి 25 స్థానాలిస్తే ఢల్లీి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. 31 మంది ఎంపీలు అయ్యారు. ఏనాడైనా ప్రత్యేక హోదా, నిధుల గురించి అడిగారా? పోలవరం ప్రాజెక్టు గురించి అడిగారా? ప్రభుత్వ అనాలోచిత చర్యలతో అమర్ రాజా, లులూ, రిలయన్స్, జాకీ పక్క రాష్ట్రానికి పారిపోయాయి. ఒక్క ఓటువల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో యువత అంతా ఆలోచించాలి. ఒక నెలలో కూటమి ప్రభుత్వం వస్తుంది, తొలి సంతకం మెగా డీఎస్సీపైనే, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం.
బడేటి చంటి, మహేష్ యాదవ్‌లను గెలిపించండి
గోదావరి గర్జన అదిరిపోయింది, గోదావరి యూత్ పవర్ సూపర్. ద్వారకాతిరుమల ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ నేల. గోదావరి వాసుల మమకారం, వెటకారం కూడా సూపర్. గోదావరి జిల్లా అమ్మాయిని పెళ్లాడాను. ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత ఎవరూ మరువలేరు. ప్రపంచానిక్ రొయ్యలు, చేపలు పంపేది గోదావరి జిల్లాల నుంచే. ఏ రంగంగలో చూసినా గోదావరి వాళ్లు నెం.1గా ఉంటారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు గోదావరి వాసులు. సాంప్రదాయంగా కోడిపందాలు వేస్తారు, వచ్చే సంక్రాంతికి వచ్చి ఇక్కడ కోడిపందాలు చూస్తా. గతంలో ఇదే గడ్డపై యువగళం పాదయాత్ర చేశా. ఇప్పుడు యువగళం సభకు ఇక్కడకు రావడం నా అదృష్టం. గత ప్రభుత్వ హయాంలో 1200 కోట్లతో బడేటి బుజ్జి ఏలూరును అభివృద్ధి చేశారు, ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్న నాని కరోనా సమయంలో మంత్రిగా ఉన్నా ఎంతోమంది చనిపోయారు బాధేస్తోంది. వైద్యఆరోగ్య మంత్రిగా పనిచేసి సొంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేకపోయారు. తాగునీరు కలుషితమైనప్పుడు నేనువచ్చా..ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం లేదు. కార్పొరేటర్లు ప్రజలను వేధిస్తున్నారు. ఇదే రాజకీయం అనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత అసాంఘిక శక్తులకు తగిన గుణపాఠం చెబుతాం. ఏలూరులో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించాలంటే కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. ఆనాడు బడేటి బుజ్జి ఏ ఆశయాలతో అభివృద్ధి చేశారో అదే ఆశయాలను చంటి ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవనన్న చెప్పిని మాటను అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఏలూరులో భూకబ్జాదారులు, గంజాయి బ్యాచ్‌ల భరతం పట్టాలంటే చంటిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి చేసేందుకు ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్‌ను గెలిపిం చాలి. ఆయన ఎంపీ అయితే నిధులు, పెట్టుబడులు తెస్తారని తెలిపారు.