ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
తల్లిపాలు బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, తల్లిపాలతో బిడ్డ ఎదుగుదలకు, ఆరోగ్యానికి మంచి పోషణ లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని పెద్ద రామాలయం సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాల సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యర ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గర్బిణులకు, బాలింతలకు, బాలికలకు ఆరోగ్యవంతమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తున్నట్లు తెలిపారు.