హరీష్‌ రావు అండతోనే ఫోన్‌ ట్యాపింగ్‌!

-బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వారే టార్గెట్‌
-విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
-మీడియా యజమాని పాత్ర కీలకం
-మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం

హైదరాబాద్‌, మహానాడు: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మరో నిందితుడు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయట పెట్టారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్లడిర చారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజు, కడియం శ్రీహరి తో విభేదాలున్న రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేతో విభేదాలున్న పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులపై నిఘా పెట్టినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టినట్లు వివరించారు. అలాగే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు మార్‌, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న, జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్‌, అరవింద్‌ అనుచరులు, పలువురు మీడి యా యజమానుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు బయటపెట్టారు. హరీష్‌రావు అండతో ఓ మీడియా యజమాని ఆధ్వర్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు వెల్లడిరచారు. ఆయన ఆదేశాలతో ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లిన ఆ మీడియా యజమాని పలువురి ఫోన్లు ట్యాప్‌ చేశారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు అందించినట్లు వాంగ్మూలంగా చెప్పారు. అప్పటినుంచి కాం గ్రెస్‌, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా ఉంచారని తెలిపారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.