పిన్నెల్లి పరారీ…పోలీసుల అసమర్థతకు నిదర్శనం

సీబీఐని రంగంలోకి దింపి అరెస్టు చేయాలి
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి సోదరుల పరారీ ఉదంతం రాష్ట్ర పోలీసుల చేతగానితనానికి నిదర్శమనని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తి పాటి పుల్లారావు ధ్వజమెత్తారు. పిన్నెల్లి అరెస్టులో జరుగుతున్న జాప్యంపై గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పందించారు. జరుగుతున్నవి చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని ధ్వజమెత్తారు. పిన్నెల్లిని ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారనే నమ్మకం లేదని.. అందుకే సీబీఐని రంగంలోకి దించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రజల కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పిన్నెల్లిని పట్టుకోవడం చేతగాని వారికి చలో మాచర్లను అడ్డుకునే హక్కు ఎక్కడిదని నిలదీశారు. పిన్నెల్లిని తప్పించడంలో మొదటినుంచి అధికారుల పాత్ర సుస్పష్టంగా ఉందని పోలింగ్‌ రోజునే వెబ్‌కామ్‌ పుటేజీ ఎందుకు చూడలేదు? ఎందుకు కేసుపెట్టలేదు? అని ప్రశ్నించారు.