కారంపూడిలో అనుచరులతో పిన్నెల్లి సోదరుడి బీభత్సం

టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, హోటళ్ల ధ్వంసం
ఘర్షణలో సీఐ నారాయణస్వామికి తీవ్రగాయాలు
మోహరించిన ఇరువర్గాలు…తీవ్ర ఉద్రిక్తత

కారంపూడి, మహానాడు : కారంపూడి పట్టణంలో వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. ముందుగా మండ లంలోని పేట సన్నగండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కొందరు వైసీపీ నాయకులు ఇళ్లపై దాడులు జరగడంతో పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై టీడీపీ శ్రేణులు రాయి విసిరటంతో వివాదం చెలరేగింది. దీంతో భారీ కాన్వాయ్‌లో రాడ్లు, కర్రలతో అనుచరులతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి పట్టణంలో హల్‌చల్‌ చేశారు. రోడ్డు వెంట కనిపించిన వారిపై దాడులు చేస్తూ టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, హోటళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో సీఐ నారాయణస్వామికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం రాత్రి కూడా ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు మోహరించాయి. కారం పూడిలో యుద్ధ వాతావరణం నెలకొంది.