– ముఖ్య అతిథి ఎమ్మెల్యే చదలవాడ
మాచవరం, మహానాడు: రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.”పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయ మేలుకువలు నేర్పించి పంట దిగుబడిని పెంచేందుకు సహకరిస్తారన్నారు. లాభసాటి వ్యవసాయానికి పొలం పిలుస్తుంది కార్యక్రమం నాంది పలుకుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అంది వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని పండగలా చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. రైతు మొహంలో చిరునవ్వులు చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.