టీడీపీతో పోలీసులు, ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కు

రూరల్‌ సీఐ డబ్బు తీసుకుని వారికి పనిచేశాడు
దమ్మాలపాడులో రీ పోలింగ్‌ జరిపించాల్సిందే
సత్తెనపల్లిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నా
వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు

సత్తెనపల్లి, మహానాడు :
పల్నాడు ప్రాంతంలో టీడీపీతో ఎన్నికల కమిషన్‌, పోలీసులు కుమ్మక్కయ్యారని సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. సంక్షేమ పాలన మళ్లీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు. ఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునే వాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్‌ రెడ్డి కోసం తాపత్రయపడి మరీ ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని 70 శాతం మంది ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేశారని వివరించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. సత్తెనపల్లిలో భారీ మెజారిటీతో గెలవబోతు న్నానని తెలిపారు. ఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగింది. డీజీపీ, ఐజీ, ఐపీఎస్‌లను మార్చారు. ఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. గొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్‌ చేసినా గంటల తరబడి రీచ్‌ కాలేదు. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. నకరికల్లు ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారు. ఎస్పీకి కాల్‌ చేస్తే ఎలక్షన్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు నన్ను ఇంటికి వెళ్లిపో మన్నారు. కానీ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీనారాయణ తిరిగారు. కన్నా కుమారుడు మీ అంతు తేలుస్తా అని ఓటర్లను బెదిరించారు.

ఆ సీఐ కుమ్మక్కయ్యాడు…

సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు టీడీపీతో కుమ్మక్కయాడు. వారి దగ్గర డబ్బులు తీసుకుని స్వచ్ఛందంగా వారికి పనిచేశాడు. దమ్మాలపాడు బూత్‌లో పోలీసులను మేనేజ్‌ చేసి పక్కాగా ఓట్లు వేయించారు. ఈ విషయం ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశా. ఎలక్షన్‌ కమిషనర్‌ రీ పోలింగ్‌ అవసరం లేదు అన్నారు. మళ్లీ కోరుతున్నా రీ పోలింగ్‌ జరిపిం చాల్సిందే. నా అల్లుడు ఉమేష్‌ కారుపై దాడి చేశారు. చీమలమర్రి, దమ్మాలపా డు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో పోలింగ్‌ సక్రమంగా జరగలేదు. ఎన్నికల కమిషన్‌ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నాను. కొన్ని చోట్ల పోలింగ్‌ అధికారులు కుమ్మక్కయ్యారు. ఎవరి ఓటు వాళ్లు వేస్తే సమస్య లేదు. అందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు. మోసగాడు చంద్రబాబును ఓడిరచి మొనగా డు జగన్‌ను గెలిపించబోతున్నారని స్పష్టం చేశారు.