12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యం
రేపటి నుంచి జిల్లా కేంద్రాలలో సభలు
హైదరాబాద్: నగరంలో బుధవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు, తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన మాదిగల జనసభ పోస్టర్లను ఆవిష్కరించారు. పిడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జూన్ 7 నుంచి జరుగుతున్న మాదిగల జనస భను జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులను కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీని యర్ నాయకులు వక్కలగడ్డ చంద్రశేఖర్, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డే యాదయ్య, అంబేద్కర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జెల్లి మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.