గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయండి

– నిరుద్యోగ జేఏసీ

అమరావతి, మహానాడు: జనవరి అయిదోతేదీ నుండి నిర్వహిస్తున్న గ్రూప్ – 2 ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని, గ్రూప్- 1 మెయిన్స్ కి 1:100 రేషియో లో తీయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఏపీపీఎస్‌సీ చైర్మన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ హయాంలో నియమించిన బోర్డు సభ్యులను ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఇతర కీలక నిర్ణయాల్లో బోర్డు సభ్యుల ప్రమేయం లేకుండా గోప్యత, పారదర్శకతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఏపీపీఎస్‌సీ ప్రతిష్ఠను ఇనుమడింపచేయాలని ఛైర్మన్‌ ను కోరారు.