– వైసీపీ వైఫల్య పాలనతో వినతుల వెల్లువ
– ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం, మహానాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికే అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తహశీల్దార్ కార్యాలయంలో రూరల్ మండలాల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే శంకర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో వైఫల్యాల కారణంగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయన్నారు.
పింఛన్ మంజూరు చేయాలని, ఇంటి బిల్లులు అందించాలని, మంచినీరు, సాగునీరు, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా అందించినట్టు తెలిపారు. రీ సర్వే చేసిన దానికి ఎల్ పి నెంబర్లు ఇచ్చి జాయింట్ జాయింట్ అకౌంట్ లో ఇవ్వడంతో ఈ క్రాస్ కూడా జరగని పరిస్థితి నెలకొంది అని తెలిపారు. ధాన్యం అమ్మకాలు, కొనుగోలు కూడా అవకాశం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏడాదిగా కొత్త పింఛన్లు అందించిన సందర్భాలు కూడా లేవన్నారు. జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైనప్పటికీ బిల్లులు చెల్లించలేదని ప్రజల నుంచి వినతలెక్కువగా అందుతున్నాయని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.