-ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కేవలం తన అక్రమార్జన కోసం లక్షలమంది ప్రజల ఆరోగ్యాల్ని బలిపీఠంపైకి నెట్టి దుర్మార్గాలకు తగిన శాస్తి జరిగి తీరాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో అయిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు గుల్ల చేసిన జే-బ్రాండ్ మద్యం దుష్పరిణామాలపై గ్రామగ్రామంలో అధ్యయనాలు చేయించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి 5 సంతకాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సంబరాల వాతావరణం తీసుకొచ్చిన చంద్రబాబుకు ఆయన పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, యువతలో నైపుణ్య గణనకు సంబంధించిన 5 దస్త్రాలపై చంద్రబాబు చేసిన తొలి అయిదు సంతకాలు రాష్ట్ర గతిని మార్చ బోతున్నాయన్నారు. ఆర్థికంగా సవాళ్లున్నా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరేవేర్చే దిశగా తీసుకు న్న ఆ సాహసోపేత నిర్ణయాలతో అన్నివర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు ప్రత్తిపాటి. ఈ నిర్ణయాల ద్వారా సీఎం అంటే ప్రజా సేవకుడు చంద్రబాబు చాటి చెప్పారని కితాబి చ్చారు. అయిదేళ్ల క్రితం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టిన సైకోకు, మొదటిరోజే ప్రజల మనసులు చూరగొన్న సంక్షేమ సారథిక మధ్య ఈ తేడాలనూ అందరు గమనిస్తున్నారన్నారు. సామాజిక పింఛన్లు, సంక్షేమం విషయంలో నాడు-నేడూ తెలుగుదేశమే ఛాంపియన్ అని గర్వంగా చెప్పగలుగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రత్తిపాటి.
రూ.1000 చొప్పున మొత్తంతో పాటు మూడు నెలల బకాయిలు కలిపి జులై-1న 7వేల రూపాయల పింఛను అందుకోబోతున్న అవ్వాతాతల ముఖాల్లో కొత్త వెలుగుల కోసం అంతా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. పెరిగిన పింఛన్లతో ఇప్పటికే వికలాంగులు చెప్పలేని సంతోషంతో ఉన్నారని, పేదల ఆకలి తీర్చేందుకు 100రోజుల్లో అన్ని అన్నాక్యాంటీన్లు పునఃప్రారంభించే దిశగా పార్టీ ఆలోచన చేస్తోం దనీ వెల్లడించారు ప్రత్తిపాటి. మరో రెండున్నర సంవత్సరాల్లోనే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవుతుందని, జగన్ అరాచకాల ప్రక్షాళనకు ల్యాండ్ టైట్లింగ్‌చట్టం రద్దు ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు.