చిత్రకారుడు జెస్టిస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

వినుకొండ, మహానాడు : వినుకొండ ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ వజ్రగిరి జెస్టిస్‌కు జాతీయ కుంచె గురు అవార్డు దక్కింది. కర్ణాటక రాష్ట్ర చిత్రకారుల సమాఖ్య భారతీయ నామఫలక కుంచె కళావిరద సంఘ్ వారు భారత జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకారుల మహాసభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గత బుధవారం ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు కవులు కళాకారులు, పాస్టర్‌లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు, ఆయనను అభినందించారు.