‘గ్రీన్ గ్రేస్’ పనులు అడ్డుకోండి

– పర్యావరణ అనుమతుల్లేవ్‌
– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ

పొన్నూరు, మహానాడు: పర్యావరణ అనుమతులు లేని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాలను నిలుపుదల చేయాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఆయన ఏమన్నారంటే.. పర్యావరణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ వారికి ఫిర్యాదు చేశాం. ఆదిత్య ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు టవర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి 2015 జులై 9న పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. 2019 జులై 12న వారు ఆదిత్య ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాన్ని రద్దు చేశారు. బజరంగ్ జూట్ మిల్లు గా ఉన్న పేరును ఏలూరు జూట్ మిల్లుగా మార్చుకున్నారు.

ఏలూరు జూట్ మిల్లులు తమ పేరుపై ఈసీ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబర్‌ 7న ఏలూరు జూట్ మిల్లు వారు బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారితో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ, పొల్యూషన్ అనుమతులు లేకుండా నిర్మాణాలను ప్రారంభించారు. ఆదిత్య ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన యన్.ఓ.సి. లేదు. ఈసీ ఆర్డర్ తేదీలో పేర్కొన్న షరతులను వారు ఖచ్చితంగా పాటించాలని అఫిడవిట్ ది.09-07-2015 జులై 9న దాఖలు చేయలేదు. ఏపీపీసీబీ నుండి ఎస్టాబ్లిష్ మెంట్(సిఓఈ)కి అనుమతి పొందలేదు. ఆదిత్య ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన డిజైన్, ఫ్లాన్, స్టక్చర్ ఏలూరు జూట్ మిల్లుల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నందున వివరణాత్మక విచారణ జరిపించాల్సినదిగా సంబంధిత అధికారులను కోరటమైనది.

ఏలూరు జూట్ మిల్లుల నిర్మాణంలో డిజైన్, ప్లాన్, నిర్మాణ విస్తీర్ణం, టవర్ ల సంఖ్య భిన్నంగా ఉన్నాయి. బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్జాజెక్టు కోసం 2023లో అభివృద్ది ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణానికి భజరంగ్ ఇన్ ఫ్రా ప్రైవేటే లిమిటెండ్ కంపెనీ ఏలాంటి తాజా ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదు. ఎన్‌. జి.టి. ప్రకారం, అపార్టుమెంట్ ల ప్రారంభానికి అనుమతి లేకుండా(సిఓఈ) సమ్మతితో అపార్టుమెంట్ నిర్మాణాన్ని ప్రారంభించించటం ఉల్లంఘనలు అతిక్రమించటమే. ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా జరిమానా విధించాలి. ఇలాంటి మోసపూరితమైన విధానంతో రిజిస్ట్రేషన్ బదిలీ, బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చేస్తున్న నిర్మాణాలను నిలుపుదల చేయాలి.