అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో ఉంటుంది. వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ పర్యటన ఉంటుందని బీజేపీ ప్రకటించింది.