సమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం

– గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

యాచవరం, మహానాడు: వైసీపీ పాలకులు ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని, చంద్రన్న కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో ఏమేం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని తీర్మానం చేసేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం, యాచవరం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు.

గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మేళాతాళాలతో ఘణ స్వాగతం పలికారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న గోకులం షెడ్డు భూమి పూజా చేసిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామాలకు కల్పతరువు లాంటిదని, గ్రామ పంచాయతీల నిధులను మళ్ళించి జగన్ రెడ్డి గ్రామాలను నాశనం చేశారన్నారు. అనంతరం ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కారుమంచి పీరయ్య, ఎంపీడీవో జగదీశ్, ఎమ్మార్వో విజయ్ కుమార్, జడ్పీటీసీ సభ్యురాలు చెన్ను విజయ, మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు, బోయపాటి వెంకటేశ్వర్లు, మార్నెని శ్రీనివాసులు, చేకూరి రమణారావు, మోరిమిశెట్టి రామకృష్ణ, గంజి పెద్ద వెంకటేశ్వర్లు, శివరామయ్య, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.