– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
విజయవాడ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన దేవదాయ భూములను కాపాడాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి దేవదాయ శాఖా మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను బలోపేతం చేసి త్వరగా దేవదాయ భూముల కేసులు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలన్నారు. గత వైకాపా ప్రభుత్వ లోపాలను ప్రజల దృష్టికి తెచ్చి దుర్మార్గ పాలనను అంత మొందించడంలో ఆనం రామనారాయణ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి స్పందిస్తూ అన్యాక్రాంతమైన భూములను స్వాధీన పరుచుకోవడానికి చర్యలు చేపట్టామని ఎండోమెంట్ ట్రిబ్యునల్ ను బలోపేతం చేస్తామని తెలిపారు.