– ఏపీవీడబ్ల్యుఎస్‌ఈఎంపీబ్ల్యుఏ రాష్ట్ర అధ్యక్షురాలు మధులత
విజయవాడ, మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతకు సహకరిస్తుందని ఆశలతో ఉన్న సచివాలయ ఉద్యోగులు వారి జాబ్ చార్ట్ తో సంబంధంలేని పనులు చేయడంతో పని ప్రదేశాల్లో తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని
రాష్ట్ర సచివాలయాల మహిళ ఉద్యోగుల(ఏపీవీడబ్ల్యుఎస్‌ఈఎంపీబ్ల్యుఏ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. మధులత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మీడియా మాట్లాడారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇంటింటి సర్వే, బీఎల్‌వో విధులు, కుళాయిలు సర్వే, మరుగుదొడ్లు సర్వే అని, తెల్లవారుజామున అయిదు గంటలకే పెన్షన్ పంపిణీ అని మహిళలకు ఇబ్బందులు ఉంటాయని కూడా ఆలోచించకుండా లక్ష్యాలు నిర్దేసిస్తున్నారన్నారు. వారిని మానసిక ఒత్తిడికి గురిచేయడం కరెక్ట్ కాదని, దీని గురించి ఉన్నతాధికారులు పునరాలోచించాలని ఆమె కోరారు. ప్రభుత్వం వారు తమ సమస్యలు గుర్తించి సరైన విధి విధానాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.