ఆరోగ్య హక్కుకు రక్షణ మా బాధ్యత

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి: మన మంచి ప్రభుత్వం – మన ప్రభుత్వంలో భాగంగా ప్రజల ఆరోగ్య హక్కును రక్షించేందుకు మేం చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆర్‌సీఎం స్కూల్ లో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని టీడీపీ యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మి ఏమన్నారంటే… ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌, యువతకు భవిత, స్ఫూర్తి ప్రదాత విద్యా శాఖ మాత్యులు లోకేష్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ జేజేలు అందుకుంటున్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి ఛిన్నాభిన్నం అయింది. అన్ని రంగాలనూ నాశనం చేసి అభివృద్ధి లేని రాష్ట్రంగా మార్చారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రాను అప్పుల రాష్ట్రంగా మార్చడమే గాకుండా వారి పైశాచికత్వంతో విధ్వంసాన్ని సృష్టించారు. సీఎం, ఇతర మంత్రుల సహకారంతో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోదాం. ఇప్పటికే దర్శి ప్రాంతంలో అభివృద్ధి మార్గంగా ముందుకు వెళుతున్నాం.. ఇందులో భాగంగానే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ సహకారంతో మెడికల్ క్యాంపు లను నిర్వహిస్తున్నాం.

ఇచ్చిన మాట ప్రకారం 5000 మందికి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేశాం. ప్రజల ఆరోగ్య భద్రత కొనసాగింపులో భాగంగానే శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ప్రకాశం అంధత్వ నివారణ శాఖ సౌజన్యంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని దొనకొండలో చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో ప్రతినెల చేపట్టేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నాం. ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో విరాజిల్లేందుకు మా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం.

జిల్లాకు చెందిన పెద్దలు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి సహకారంతో దర్శి ప్రాంతాన్ని వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దొనకొండ, కురిచేడు మండల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వర రావు, పిడతల నేమిలయ్య, తదితరులు పాల్గొన్నారు.