– ఎమ్మెల్యే జీవీ
వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించగా, ఎమ్మెల్యే జీవీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకుంటుందన్నారు.
పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ వద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.