దేవాలయాల్లో ఎమ్మెల్యే జూలకంటి పూజలు

కారంపూడి, మహానాడు: కారంపూడి మండలంలోని పలు దేవాలయాల్లో ఆదివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పేట సన్నిగండ్ల శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు చేశారు. ఒప్పిచర్ల గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపుల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించి, పూజలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంగులూరి. అంజయ్య, పంగులూరి. పుల్లయ్య, చప్పిడి రాము, బొల్లినేని శీను, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, గుండాల శ్రీనివాస్ కూరపాటి, ప్రసాద్, చావా. వీరాంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.