రేపు నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పులి శ్రీనివాసులు

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా పులి శ్రీనివాసులు బుధవారం(ఆగస్ట్ 14)న విధుల్లో చేరనున్నారు.
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహస్తున్న పులి శ్రీనివాసులు 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ క్యాడర్ లో సర్వే, సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహించారు.

అలాగే డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, కెఆర్ పురం ఐటిడిఏ పిఓ, పశ్చిమ గోదావరి డిఆర్డీఏ పిడి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ(ఎఫ్ఏసి), కెఆర్ పురం ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డీసి (ఎఫ్ఏసి), పోలవరం గిరిజన సంక్షేమం ఎస్డీసి, పశ్చిమ గోదావరి జెడ్పీ సిఈఓ(ఎఫ్ఏసి), హైదరాబాదులోని ఏపిఐఐసి ఎస్డీసి (భూములు), గుంటూరు జిల్లా డ్వామా పిడి, అమరావతి నుండి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఎస్డీసి, గుంటూరు జిల్లా ఎస్సి కార్పోరేషన్ ఈడి(ఎఫ్ఏసి), గుంటూరు జిల్లా డిఆర్ఓ, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పి సిఈఓ, పిడి, డిఆర్డిఏ (ఎఫ్ఏసి), పిడి డ్వామా (ఎఫ్ఏసి), డిపిఓ (ఎఫ్ఏసి), ప్రకాశం డిఆర్ఓగా జిల్లా స్థాయిలో పలు భాధ్యతల్లో విధులు నిర్వహించారు.

అలాగే అద్దంకి, పెదకూరపాడు, ఎస్ఎన్ పాడు తహసిల్దార్ గా, ఏపి సెక్రెటేరియట్ లో వివిధ కేడర్లలో విధులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏఈఆర్ఓ, ఏఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఓ, పలు మున్సిపాలిటీలకు, మండల పరిషత్ లకు ప్రత్యేక అధికారులుగా నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి అధికారి, గుంటూరు నగరపాలక సంస్థలో ప్రభుత్వం నిర్వహించిన నోడల్ అధికారి, ప్రత్యేక అధికారిగా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ చేశారు. సర్వీస్ లో వివిధ ఉన్నతాధికారుల నుండి 7 అవార్డ్ లను, ఉత్తమ అధికారిగా 9 సార్లు అవార్డ్ లు అందుకోవడం జరిగింది