-గన్‌మెన్ ధరణికి పరామర్శ
-వారు లేకుంటే ప్రాణాలు పోయేవని వ్యాఖ్య
-మంచిపద్దతి కాదని చెవిరెడ్డికి హితవు
తిరుపతి, మహానాడు: వైసీపీ మూకల దాడిలో గాయపడి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. చంద్రగిరిలో ఉన్న గన్‌మెన్ ధరణి ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్‌మెన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదని తెలిపారు. వాళ్లు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని అన్నారు. ఓటమి భయంతో చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచు వారిపల్లిలో గ్రామస్తులను పట్టుకుని చితకబాదారు. నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతి కాదని హితవుపలికారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వహించారని పేర్కొన్నారు.